Breaking News

మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు

కామారెడ్డి, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత ఎన్నికల్లో చెప్పినట్టు మాయమాటలు చెప్పి ప్రజలను తిరిగి మోసగించలేరని కెసిఆర్‌, ఆయన నాయకుల మాయమాటలు వినే పరిస్తితిలో ఓటర్లు లేరని కామారెడ్డి కాంగ్రెస్‌ అబ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. బుధవారం ఆయన మాచారెడ్డి మండలం లచ్చపేట్‌, మాచారెడ్డి ఎక్స్‌రోడ్డు, కొత్తపల్లి, ఘన్‌పూర్‌, లక్ష్మిరావులపల్లి, బండరామేశ్వర్‌పల్లి ఎలుపుగొండ గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాచారెడ్డి తన స్వంత మండలమని, గత ఎమ్మెల్యే పనితీరు కారనంగా మండలంలో అభివృద్ది కుంటుపడిందన్నారు. తన హయాంలో చేసిన అభివృద్దే తప్ప కొత్తగా చేసిందేమి లేదన్నారు. కెసిఆర్‌ అబద్దాలు ప్రజలకు అర్థమైపోయాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాకుంటే పింఛన్లు రావు, రైతు రుణాలు మాఫీ కావని తెరాస నాయకులు ప్రజలకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పింఛన్లు రెట్టింపుతో పాటు, ఒకేసారి రెండు లక్షల రైతురుణమాఫీ చేస్తామని అన్నారు. తనను గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *