Breaking News

ప్రాణ త్యాగాలు విద్యార్థులవి, బోగాలు కెసిఆర్‌ కుటుంబానివా

కామారెడ్డి, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ కోసం విద్యార్థులు వేల సంఖ్యలో ఆత్మబలిదానాలు చేస్తే కెసిఆర్‌ కుటుంబం నేడు వాటి బోగాలను అనుభవిస్తుందని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు ఆరోపించారు. కామారెడ్డి పట్టణంలోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో బుధవారం టిఎన్‌ఎస్‌ఎఫ్‌, టిజెఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఆత్మత్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో కెసిఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని, విద్యార్థులకు, నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని వాపోయారు. కెసిఆర్‌కు మందులు అందించినందుకే సంతోష్‌రావుకు ఎంపి పదవి ఇస్తే ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసిన విద్యార్థులను నిలువునా దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌లు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తును ఆగమ్యగోచరంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌చార్జి లక్ష్మణ్‌ మాట్లాడుతూ దక్షిణ ప్రాంగణంలోని కోర్సులను తరలించిన మాజీ ఎమ్మెల్యేతోపాటు ఈ ప్రాంత నాయకులు స్పందించకపోవడం గర్హణీయమన్నారు. ఇక జిల్లాను ఎలా ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తారని నిలదీశారు. తెరాసకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *