Breaking News

Daily Archives: November 29, 2018

తెరాస ద్వారానే బంగారు తెలంగాణ

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం తెరాస పార్టీ వల్లే సాధ్యమని కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి గంప గోవర్దన్‌ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస కెసిఆర్‌ పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, సంక్షేమ పథకాలను చూసి తమను తిరిగి ఆదరించాలని కోరారు. కెసిఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే ఆదర్శ పథకాలుగా నిలిచాయని ఆ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రంలో ...

Read More »

రైలు ఢీకొని యువకునికి తీవ్ర గాయాలు

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో గురువారం పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో ఓ యువకునికి తీవ్ర గాయాలైనట్టు రైల్వే పోలీసులు తెలిపారు. కామారెడ్డి పట్టణం హరిజన వాడకు చెందిన రాజు (40) పట్టాలు దాటుతుండగా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టిందన్నారు. తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.

Read More »

ఓటమి భయంతోనే తెరాస అసత్య ప్రచారాలు

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస నాయకులకు ఓటమి భయం పట్టుకుందని, అందుకనే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పథకాలను రద్దుచేస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారని కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి మండలం అడ్లూర్‌, ఇల్చిపూర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు కెసిఆర్‌ తమ ఇంట్లోంచి ఇస్తున్నాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వస్తే పథకాలను కొనసాగించడమే కాకుండా వాటిని మరింత మెరుగుపరుస్తామని, ఆరోగ్యశ్రీ పరిదిని రెండు ...

Read More »

ఎన్నికల యాంత్రీకరణ సిద్దం

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక జూనియర్‌ కళాశాలలో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో కంట్రోల్‌ యూనిట్స్‌, బ్యాలెట్‌ యూనిట్స్‌, వీవీప్యాట్‌ యంత్రాలను సిద్దం చేసే యాంత్రీకరణ ప్రారంభించినట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. యాంత్రీకరణ కార్యక్రమంలో కామారెడ్డి రిటర్నింగ్‌ అధికారి రాజేంద్రకుమార్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌, 21 మంది సెక్టోరల్‌ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూం తెరిచి ఈ ప్రక్రియ కొనసాగించారు. ...

Read More »

ఎన్నికల విధులపై పూర్తి అవగాహన అవసరం

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు పోలింగ్‌ నిర్వహణ పట్ల, విదుల పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. గురువారం జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబందించి బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్‌ విధులపై నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ...

Read More »

పోచారం విస్తృత ప్రచారం

బాన్సువాడ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో అదికార పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. గురువారం బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆయన సుడిగాలి ప్రచారం కొనసాగించారు. బుధవారం బాన్సువాడలో నిర్వహించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రచార సభ విజయవంతం కావడంతో మంచి ఊపుమీద ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం వర్ని మండలం సత్యనారాయణ పురం, తగిలేపల్లి, నాయక్‌ తాండా, కోటగిరి మండలం కొడిచెర, హంగర్గ, కారేగాం, టాక్లీ, వల్లభాపూర్‌ తదితర గ్రామాల్లో ...

Read More »