Breaking News

ఎన్నికల యాంత్రీకరణ సిద్దం

కామారెడ్డి, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక జూనియర్‌ కళాశాలలో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో కంట్రోల్‌ యూనిట్స్‌, బ్యాలెట్‌ యూనిట్స్‌, వీవీప్యాట్‌ యంత్రాలను సిద్దం చేసే యాంత్రీకరణ ప్రారంభించినట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. యాంత్రీకరణ కార్యక్రమంలో కామారెడ్డి రిటర్నింగ్‌ అధికారి రాజేంద్రకుమార్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌, 21 మంది సెక్టోరల్‌ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూం తెరిచి ఈ ప్రక్రియ కొనసాగించారు. మొత్తం 250 పోలింగ్‌ స్టేషన్లకు గాను 50 రిజర్వు కలిపి మొత్తం 300 కంట్రోల్‌ యూనిట్స్‌, 300 బ్యాలెట్‌ యూనిట్లు, 315 వీవీప్యాట్‌ యంత్రాలకు కమీషనింగ్‌ ప్రక్రియ రెండ్రోజుల పాటు నడుస్తుందని వివరించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి హాజరై ఎన్నికల విదుల పట్ల సలహాలు, సూచనలు చేశారు. యంత్రాల పనితీరుపై అవగాహన కల్పించారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *