Breaking News

ఓటమి భయంతోనే తెరాస అసత్య ప్రచారాలు

కామారెడ్డి, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస నాయకులకు ఓటమి భయం పట్టుకుందని, అందుకనే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పథకాలను రద్దుచేస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారని కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి మండలం అడ్లూర్‌, ఇల్చిపూర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు కెసిఆర్‌ తమ ఇంట్లోంచి ఇస్తున్నాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వస్తే పథకాలను కొనసాగించడమే కాకుండా వాటిని మరింత మెరుగుపరుస్తామని, ఆరోగ్యశ్రీ పరిదిని రెండు లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. గల్ప్‌ బాధితులకు 500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గర్గుల్‌ గ్రామంలో అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామ చెరువు నుంచి నీరివ్వమని గ్రామస్తులు, రైతులు ప్లకార్డులు ప్రదర్శిస్తే తెరాస మాజీ ఎమ్మెల్యే అనుచరులు దాడిచేయడం గర్హణీయమన్నారు. గంప గోవర్దన్‌ ఇలాంటి బెదిరింపులు, దాడులు ఎన్నో చేయించారని ఆరోపించారు. చాలామంది అధికారులు బదిలీ చేయించుకొని వెళ్లిపోయారని చెప్పారు. పత్రికా విలేకరులపై సైతం దాడులు చేసిన ఘనత గోవర్ధన్‌కే దక్కిందని విమర్శించారు. అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కులేదని అన్నారు. తనకు ఓటు వేసి సంక్షేమం చేసే అవకాశం కల్పించాలని కోరారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *