Breaking News

తెరాస ద్వారానే బంగారు తెలంగాణ

కామారెడ్డి, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం తెరాస పార్టీ వల్లే సాధ్యమని కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి గంప గోవర్దన్‌ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస కెసిఆర్‌ పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, సంక్షేమ పథకాలను చూసి తమను తిరిగి ఆదరించాలని కోరారు. కెసిఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే ఆదర్శ పథకాలుగా నిలిచాయని ఆ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రంలో అభివృద్ది జరగాలంటే తెరాస అధికారంలోకి రావాలని అన్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *