Breaking News

ఆకుల లలిత విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్తి ఆకుల లలిత శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. డొంకేశ్వర్‌ గ్రామంలో మాజీ ఎంపిపి సాయిరెడ్డి ఆద్వర్యంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం ఆర్మూర్‌ పట్టణంలో 1,2,3వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో మహాకూటమి అధికారం చేపట్టడం ఖాయమని, కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని, తెరాసలో మహిళలకు ప్రాధాన్యత లేదని, తనపై నమ్మకముంచి ఆర్మూర్‌ అభ్యర్తిగా ప్రకటించారని, కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ తనకు అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తున్నారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను పుట్టింటి బిడ్డలా చూసుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం గొల్లకుర్మ సభ్యులు, గోవింద్‌ పేట్‌ సొసైటీ ఛైర్మన్‌ మహేందర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Check Also

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *