Breaking News

ధర్పల్లిలో ఆనంద్‌రెడ్డి విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బిజెపి రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. లంబాడి మహిళలు వారి సంప్రదాయ నృత్యాలతో ఆనంద్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ బాజిరెడ్డి గోవర్ధన్‌ కులాలమధ్య చిచ్చుపెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. బాజిరెడ్డి, భూపతిరెడ్డి ఇద్దరు అబివృద్ది కోసం కాకుండా ఒకరిపై ఒకరు గొడవలు పడుతూ ఆదిపత్యపోరుకు పోతున్నారే తప్ప రూరల్‌ అభివృద్దికి ఏమాత్రం కృషి చేయడం లేదని ఆరోపించారు. ధర్పల్లి మండలానికి సాగునీటి సమస్యను తీర్చింది లేదని, ఇంతవరకు చుక్కనీరు అందించింది లేదని పేర్కొన్నారు. నరేంద్రమోడి దేశాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని, ప్రపంచదేశాలు ఈరోజు భారత్‌వైపు చూస్తున్నాయని అన్నారు. గ్రామీణుల్లో కూడా బిజెపి పట్ల, పార్టీ విధి విధానాల పట్ల అవగాహన ఏర్పడిందని, యువత కూడా బిజెపి అవలంబిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణులకు వివరించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆనంద్‌రెడ్డి కోరారు. మరోవైపు ఆనంద్‌రెడ్డి కుమార్తె కావ్యరెడ్డి కూడా ఇందల్వాయి మండలంలో వివిద గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *