Breaking News

నసురుల్లాబాద్‌లో భాస్కర్‌రెడ్డి ప్రచారం

బాన్సువాడ, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో పోచారం తనయుడు దేశాయ్‌పేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస హయాంలో పేదలు, వృద్దుల కొరకు ఎంతో కృషి జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా పించన్‌ పెంచి వృద్దులు, వికలాంగులకు మేలు జరిగిందని తెలిపారు. నసురుల్లాబాద్‌ మండల ఏర్పాటుకు పోచారం ఎంతో కృషి చేశారని వివరించారు. ఈ ప్రాంత అభివృద్దికి ఆయన ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారని, మరోసారి అత్యధిక మెజార్టీతో పోచారంను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులున్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *