Breaking News

ప్రచారంలో దూసుకుపోతున్న బిగాల

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ తెరాస అభ్యర్థి బిగాల గణేశ్‌ గుప్త ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించి నగరంలోని పలు డివిజన్లను చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 16వ డివిజన్‌లో వెంకటేశ్వర కళ్యాణమండపం, గాయత్రీనగర్‌ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్తానిక ప్రజలు పూలమాలలతో హారతులిచ్చి బిగాలకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా గుప్త మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సంక్షేమ పథకాలే తమకు బలమని, సంక్షేమ పథకాల ద్వారానే తమ గెలుపు దాదాపు ఖాయమైందని గణేశ్‌ గుప్త అన్నారు. ప్రచార కార్యక్రమంలో నగర మేయర్‌ ఆకుల సుజాత, కార్పొరేటర్‌ ఎనుగందుల మురళి, అంతరెడ్డి లత దేవేందర్‌, సిర్ప సువర్ణ, చంద్రకళ, సుజిత్‌సింగ్‌ ఠాకూర్‌, కొవూరి జగన్‌, సత్యప్రకాశ్‌, ఆర్‌.ఎల్‌.నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *