Breaking News

బిఎస్‌పి ద్వారానే సామాజిక న్యాయం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఎస్‌పి ద్వారానే సామాజిక న్యాయం ఉంటుందని నిజామాబాద్‌ అర్బన్‌ బిఎస్‌పి అభ్యర్తి మహతి రమేశ్‌ అన్నారు. శుక్రవారం మీట్‌ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియానుద్దేశించి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల కొరకు కాన్షీరాం బిఎస్‌పిని స్థాపించారని, ఇతర పార్టీలలాగా అగ్రకులాల పెత్తనం బిఎస్‌పిలో ఉండదని, ఇక్కడ అన్నికులాలకు సమానమైన గౌరవం ఉంటుందని, బడుగు, బలహీన వర్గాలకు బిఎస్‌పి అండగా ఉంటూ వస్తుందని అన్నారు. తెలంగాణలో బిఎస్‌పి బలపడుతుందని, రానున్న ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *