మోడి పాలనలో అభివృద్ధి పథాన భారతదేశం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోడి పాలనలో బారతదేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుదేశ్‌ వర్మ అన్నారు. శుక్రవారం జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్మ మాట్లాడారు. భారతదేశ అభివృద్ది కొరకు నిరంతర సైనికునిలా మోడి కష్టపడుతున్నారని, ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవిస్తున్నాయని, ఒకప్పుడు భారతదేశం అంటే ఇతర దేశాలకు చిన్నచూపు ఉండేదని అన్నారు. మోడి పాలనలో నల్లధనం వెలికితీయడం జరుగుతుందని, మోడి పాలనకు ఆకర్షితులై ఎంతోమంది యువకులు, ముస్లిం మైనార్టీలు కూడా బిజెపిలో చేరుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి క్రియాశీలక పాత్ర పోషించడం ఖాయమని, అదేవిధంగా నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్తి యెండల లక్ష్మినారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని మీడియా ద్వారా ప్రజలను కోరుతున్నట్టు ఆయన తెలిపారు. యెండల పార్టీకి కట్టుబడి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోసించారని, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని త్యజించిన యెండల లాంటి వ్యక్తి నిజామాబాద్‌కు ఎమ్మెల్యే కావడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, కేంద్ర కార్యవర్గ సభ్యులు టక్కర్‌ హన్మంత్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్‌ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌ డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం 60 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *