Breaking News

మహాకూటమికే ఎంఆర్‌పిఎస్‌ మద్దతు

రెంజల్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులను మోసం చేసిన తెరాస పార్టీని రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఓడించి తీరుతామని ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల హామీలను తుంగలో తొక్కి అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీని ఓడించి తీరుతామని వర్గీకరణకు మద్దతు తెలిపిన మహాకూటమికే ఎంఆర్‌పిఎస్‌ మద్దతు ఉంటుందని బోదన్‌ ఎమ్మెల్యేగా మహాకూటమి బలపర్చిన అభ్యర్తినే గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ, సురేశ్‌, నరేశ్‌, గంగాధర్‌, అశోక్‌, తదితరులున్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *