Breaking News

బాన్సువాడలో విజయశాంతి రోడ్‌షో

బాన్సువాడ, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ కాంపెయిన్‌ విజయశాంతి రోడ్‌షో నిర్వహించారు. హెలికాప్టర్‌లో ఆమె బాన్సువాడకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కాసుల బాల్‌రాజు, మాజీ ఎమ్మెల్యే గంగాధర్‌, తదితరులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం మండలంలోని కొత్తబాది నుంచి ఆమె రోడ్‌షో నిర్వహించారు. మధ్యాహ్నం బాన్సువాడ అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆమె మాట్లాడారు. దోచుకుంటున్న దొరల పాలనకు స్వస్తి పలికి కాంగ్రెస్‌ అభ్యర్తి బాల్‌రాజును గెలిపించాలని ఆమె కోరారు. త్యాగాల ఫలితంగా వెలిసిన తెలంగాణ ఉద్దేశం నెరవేరలేదని, దొరల పాలన కొనసాగుతుందని ఆమె విమర్శించారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో అభివృద్దిని పొందుపరచారని పేర్కొన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తామని, నిరుద్యోగభృతితోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి కృతనిశ్చయంతో ఉన్నామని వివరించారు. పేదల సంక్షేమాన్ని ఉద్దేశించి ఏర్పాటైన తెలంగాణలో దొరల పాలన సాగుతుందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే పేదల సంక్షేమం కొనసాగుతుందని విజయశాంతి వివరించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు రాము, నర్సారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *