Breaking News

అల్జాపూర్‌ శ్రీనన్నను ఆదరించండి

రెంజల్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాలనేత అల్జాపూర్‌ శ్రీనన్నను ఆదరించి ఆశీర్వదించి బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ అన్నారు. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్తి అల్జాపూర్‌ శ్రీనివాస్‌కు మద్దతుగా శుక్రవారం దూపల్లి, కూనేపల్లి, కల్యాపూర్‌, వీరన్నగుట్ట గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి చేసిందేమి లేదని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా తెరాస పథకాలంటూ ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉందని తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి జెండా ఎగురవేయాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పట్టం కట్టాలన్నారు. కార్యక్రమంలో బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి అల్జాపూర్‌ శ్రీనివాస్‌, నర్సింహరెడ్డి, అడ్లూరి శ్రీనివాస్‌, మండల అధ్యక్షుడు మేక సంతోష్‌, ఎంపిటిసి కిషోర్‌, పోచయ్య, సంతోష్‌, యోగేశ్‌, శుభమ్‌ తదితరులున్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *