Breaking News

తెరాసకు ఓటు వేసి గెలిపించండి

బాన్సువాడ, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అందించిన పథకాలు పేదల సంక్షేమం కోసమేనని బాన్సువాడ తెరాస అభ్యర్తి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన వర్ని మండలం ఎసన్‌పురం, చందూరు, చందూరు తాండా, గోవూరు, మోస్రా తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుధవారం బాన్సువాడలో నిర్వహించిన సిఎం సభలో చందూరు, మోస్రా గ్రామాలను మండలాలు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన వివరించారు. ఈ హామీతో ఈ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. చందూరు గ్రామ అభివృద్ది కోసం 11.70 కోట్లు నిధులు మంజూరు చేశామని వివరించారు. సుమారు 75 కోట్ల నిధులతో ఈ ప్రాంతంలో సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. మరోసారి అభివృద్దికి ఓటు వేసి తెరాసను ఆశీర్వదించాలని పోచారం కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రిని మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *