Breaking News

మహాత్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకం

కామారెడ్డి, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని శ్రీసీతారామచంద్ర ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాస పర్వకాలాన్ని పురస్కరించుకొని ఆదివారం మహా త్రిపుర సుందరి అమ్మవారికి పసుపుకొమ్ములతో అభిషేకం నిర్వహించారు. సహస్రనామ పారాయణ యుక్తంగా గోపూజ చేశారు. ఆంజనేయ శర్మ, శ్రవణ్‌ శర్మ, వినోద్‌శర్మ, రామశర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గబ్బుల బాలయ్య, శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌, దామోదర్‌, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు తీసుకువచ్చే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *