Breaking News

రూరల్‌ నియోజకవర్గంలో బాజిరెడ్డి విస్తృత ప్రచారం

– నీరాజనాలు పలుకుతున్న ప్రజలు

– గెలుపుబాటలో బాజిరెడ్డి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ తెరాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం డిచ్‌పల్లి మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి బాజిరెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు బాజిరెడ్డిని హారతులతో స్వాగతం పలుకుతూ గెలుపునకు పునాదులు వేస్తున్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పాటుకు తోడ్పడుతాయని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయలేదని అన్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రతిపక్షాలు తెరాస పథకాలపై హేళన చేస్తు మాట్లాడుతున్నారని, కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసునని అన్నారు. ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి, ఒంటరి మహిళ పింఛన్లు, వృద్దాప్య, వికలాంగ పింఛన్లు బడుగు, బలహీన వర్గాలకు చేరుతున్నాయని, ప్రతి ఇంట్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నవారు ఉండడం చూస్తే తమకు ఎంతో ఆనందం కలుగుతుందన్నారు. సంక్షేమ పథకాలతోపాటు తెలంగాణ అభివృద్దికి, బంగారు తెలంగాణ నిర్మాణానికి కెసిఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధికారం చేపట్టడం ఖాయమని తద్వారా కెసిఆర్‌ కల అయిన బంగారు తెలంగాణ సాధించుకున్నవారమవుతామని, భావితరాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి నీటి ఎద్దడి కలగకుండా మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనులను చేపట్టారని, దీనిపై కూడా ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తు రైతులకు నీరందకుండా కుటిల బుద్దితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంతో బృహత్తర పథకాలు చేపడుతున్న తెరాస ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమంలో భాగంగా మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి తెలంగాణలో టిడిపితో పొత్తుపెట్టుకొని ఆంధ్రపెత్తనం చలాయించడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో తెరాస అధికారం చేపట్టడం ఖాయమని అదేవిధంగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రూరల్‌ నియోజకవర్గాన్ని మాడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *