Breaking News

తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న మార్పు బిజెపితోనే సాద్యం

కామారెడ్డి, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పు బిజెపి ద్వారానే సాధ్యపడుతుందని జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోడి నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కెసిఆర్‌ పాలనను విసిగి వేసారిన ప్రజలు బిజెపికి అభివృద్ది చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర పథకాలను ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజల చెంతకు చేరకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా దేశం మొత్తం ఇల్లు కట్టిస్తుంటే కెసిఆర్‌ ఆ పథకాన్ని వద్దన్నారని, ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా దేశంలోని పది కోట్ల మందికి ఈ పాటికే 5 లక్షల వరకు ఉచిత వైద్యం చేస్తే దాన్నీ వద్దన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభివృద్ది, సంక్షేమం ఆరోగ్యాన్ని కోరుకుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎందుకు ఆహ్వానించడం లేదని నిలదీశారు. ఆయన అభద్రతా భావంలో ఉన్నారని అందుకే కేంద్ర పథకాల ద్వారా పేదలు లబ్దిపొందితే బిజెపి పక్షాన నిలబడతారని, వాటిని తిరస్కరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే 5 లక్షలతో ప్రతి పేద వ్యక్తి ఉచిత వైద్యం పొందగలుగుతాడని, ఇల్లు దక్కుతాయని, కేంద్ర పథకాలన్ని దక్కుతాయని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమన్న కెసిఆర్‌ రాష్ట్రంలో 4500 మంది రైతులు చనిపోతే తన స్వంత నియోజకవర్గం గజ్వేల్‌లో 131 మంది రైతులు చనిపోతే ఏం చేశారని ప్రశ్నించారు. రైతుల సంక్షేమమే చేస్తే రైతులెందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌, టిడిపి, తెరాసలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని, మతం పేరిట మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తమ మేనిఫెస్టోలో కాంట్రాక్టుల్లో సైతం మైనార్టీలకు ప్రత్యేక కోటా అని పేర్కొనడం మజీద్‌లకు, చర్చిలకు విద్యుత్తు బిల్లులు మాఫీలని చెప్పడం గర్హణీయమన్నారు. మరి హిందువుల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఉర్దూ చదువుకున్న వారికే ఉద్యోగాలంటే మరి తెలుగువారు ఎక్కడికిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బేధభావం ఎందుకని ప్రజలు నిలదీయాల్సిన అవసరమొచ్చిందని పిలుపునిచ్చారు. అక్బరుద్దీన్‌ ఓవైసి కాంగ్రెస్‌, తెరాస, టిడిపి ఏ పార్టీలొచ్చినా తమ కాళ్ల దగ్గర ఉండాలని చెబుతున్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఎంఐఎం కాళ్లముందు కూర్చునే ముఖ్యమంత్రి కావాలో ప్రజల ముందు నిలబడే ముక్యమంత్రి కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.

Check Also

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గుడితండాలో ఆయ పూజారిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *