Breaking News

గడీల దొరల పాలనను తరిమికొట్టండి

కామారెడ్డి, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడీల దొరల పాలనను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం బాన్సువాడ, దోమకొండ, బీబీపేట్‌ తదితర ప్రాంతాల్లో రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సంక్షేమం కోసం తెరాసకు అధికారం కట్టబెడితే ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాలుగున్నరేళ్లకే చేతులెత్తేసి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఆనాడు కెసిఆర్‌తో కలిసి ఉద్యమాలు చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కనీస విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకిచ్చిన విలువ ఏదని ప్రశ్నించారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అయితే కెసిఆర్‌ తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కెసిఆర్‌ను నమ్మి జనం మోసపోయారని, దొర దొరగానే ఉన్నాడు, పేదలు పేదలుగానే మిగిలిపోయారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఆశలు పెట్టుకున్న జనాలను దొర నట్టేట ముంచారని పేర్కొన్నారు. దొర కొడుకు, దొర కూతురు, అల్లుడు కుటుంబం కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వారికి పదవులు రాగానే ఎవరిమాట వినే స్థాయిలో లేకుండా పోయారని, పదవులు శాశ్వతం కాదని, ప్రజలే శాశ్వతమని చెప్పారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటు వేసి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరముందని చెప్పారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *