Breaking News

మాక్‌ పోలింగ్‌కు ఏజెంట్లను సన్నద్దం చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ రోజు ఉదయం 6 గంటలకే ఈవిఎం, వీవీప్యాట్‌ మాక్‌ పోలింగ్‌ జరిపేందుకు ఉదయం 5.45 గంటలకే పోలింగ్‌ ఏజెంట్లను సన్నద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం తన చాంబరునుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎలక్టోరల్‌ జాబితా, ఈవిఎం, వీవీప్యాట్‌, మాక్‌పోలింగ్‌, వెబ్‌ కాస్టింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌పై సమీక్షించారు. సలహాలు, సూచనలు ఇచ్చారు. పోలింగ్‌కు 72 గంటల ముందు చేయాల్సిన విదులను ఖచ్చితంగా పాటించాలని, పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎంత రాత్రయినా మొత్తం కాలంలను పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గోదాముల్లో కౌంటింగ్‌, స్ట్రాంగ్‌రూంలు పూర్తిచేసుకొని సిద్దంగా ఉన్నాయని తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, తహసీల్దార్‌ అమీన్‌ సింగ్‌, ప్రసాద్‌, పుల్లయ్య, శ్రీనివాస్‌రావు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం బాగా కృషి చేశారు

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి, ఋతుపవనాల‌రాకకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *