Breaking News

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిగాల సోదరి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ తాజా మాజీ ఎమ్మెల్యే, అర్బన్‌ తెరాస అభ్యర్తి బిగాల గణేష్‌ గుప్త సోదరి శ్రీవాణి సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలోని కామధేను రెసిడెన్సి, అవర్‌హోమ్స్‌, ఇందూరు అపార్టుమెంటు, శ్రీసాయి రెసిడెన్సి, అక్షయ రెసిడెన్సిల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. గంగాస్థాన్‌లో ఇంటింటికి తిరిగి కెసిఆర్‌ చేసిన అభివృద్దిని వివరిస్తు బిగాలను గెలిపించాలని కోరారు. కాలనీవాసులందరు తమకు పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ ఆకుల సుజాత, కార్పొరేటర్లు ధాత్రిక రేవతి, సిర్ప సువర్ణ, చంద్రకళ, వకుళ శాస్త్రి, వనిత, చాంగుబాయి తదితరులున్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *