Breaking News

అవకాశాలు కల్పిస్తే దివ్యాంగులు ఎందులో తీసిపోరు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులకు సరైన అవకాశాలు కల్పిస్తే వారెందులోను తీసిపోరని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్తానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్‌, డిఆర్‌డిఎ, మెప్మా, స్నేహ సొసైటీ, నవనేస్తం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్‌ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజంలో అన్ని సవ్యంగా ఉన్నవారికంటే శారీరకంగా, మానసికంగా లోపమున్నవారు ఎన్నో రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారని కలెక్టర్‌ పేర్కొన్నారు. శరీరానికే తప్ప లోపం మనసుకు, తెలివితేటలకు కాదని, ఎందరో ఇప్పటికే నిరూపించారని, అందరితోపాటు దివ్యాంగులకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తే వారు తమప్రతిభను కనబరుస్తారని, వారికి జాలి, కరుణ కంటే ప్రోత్సాహం ముఖ్యమని, తద్వారా మెరుగైన ప్రతిభను కనబరుస్తారని కలెక్టర్‌ అన్నారు. అనంతరం ప్రీమెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను వివిధ రంగాల్లో ప్రతిబ కనబర్చిన దివ్యాంగులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారిణి స్రవంతి, అధికారులు దుర్గాప్రసాద్‌, రమేశ్‌ రాథోడ్‌, రాములు, స్వచ్చంద సంస్థల ప్రతినిదులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *