Breaking News

దివ్యాంగుల ఉత్పత్తులను వసతి గృహాల్లో వినియోగిస్తాం

కామారెడ్డి, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు చిన్నతరహా పరిశ్రమల ద్వారా తయారుచేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంక్షేమ వసతి గృహలకు వినియోగిస్తామని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక రాజీవ్‌నగర్‌లో శాంతిసేన దివ్యాంగుల సమితి వారి చిన్నతరహా కుటీర పరిశ్రమను కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులు తయారుచేసిన సర్ప్‌, పినాయిల్‌ ఉత్పత్తులను చూసి అభినందించారు. దివ్యాంగులను ప్రేమపూర్వకంగా, కుటుంబ సభ్యుల్లా చూసి ఆదరించాలని, ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ అధికారి రాధమ్మ, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, శాంతిసేన దివ్యాంగుల అద్యక్షుడు జబ్బార్‌సింగ్‌, రజిత, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *