Breaking News

మోపాల్‌ మండలంలో ఎంపి కవిత విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండల కేంద్రంలో నిజామాబాద్‌ ఎంపి కవిత, రూరల్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌తో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇరువురు రోడ్‌షోలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ పార్టీని గెలిపిస్తాయని, రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టడం ఖాయమని, ఇప్పటికే పలు సర్వేలు తెరాస అధికారం చేపడుతుందని తెలిపాయని అన్నారు. అదేవిధంగా రూరల్‌ అభ్యర్థి బాజిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల అయిన బంగారు తెలంగాణ కోసం తామందరం సైనికుల్లా నిరంతరం పనిచేస్తామని, ఇందుకు కట్టుబడి ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేస్తున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *