Breaking News

పార్టీల నేతలు పోలింగ్‌ ఏజెంట్ల వివరాలు అందించాలి

కామారెడ్డి, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్‌ ఏజెంట్ల వివరాలను అందించాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. నాయకులతో కలెక్టర్‌ చాంబరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ రోజు ఉదయం 6 గంటల నుంచి 6.30 వరకు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తున్నందున ఉదయం 5.45 గంటలకే పోలింగ్‌ ఏజెంట్లు సన్నద్దమయ్యేలా చూడాలని సూచించారు. పోలింగ్‌ ఏజెంట్లకు సంబంధించి ఇద్దరు రిలీవర్స్‌ను అనుమతించడం జరుగుతుందని సాయంత్రం 4 తర్వాత రిలీవర్‌ను అనుమతించమని పేర్కొన్నారు. అభ్యర్థుల నేరచరిత్రకు సంబంధించి 5వ తేదీ సాయంత్రం వరకు మూడుసార్లు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రకటించాలని సూచించారు. అన్ని ఫంక్షన్‌హాల్‌పై నిఘా ఉంచామని, నిబందనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఓటర్లకు ఓటరు స్లిప్పులు పంఫిణీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 60 లక్షల 60 వేల 457 రూపాయల డబ్బు సీజ్‌ చేసినట్టు చెప్పారు. ఎక్సైజ్‌ ద్వారా 217 కేసులు నమోదయ్యాయన్నారు. వంద అరెస్టులు జరిగాయని, సిఆర్‌పిఎస్‌ కింద 1831 మందిని బైండోవర్‌ చేశామని, మద్యానికి సంబంధించి 427 కేసులు బుక్‌ చేసినట్టు వివరించారు. 16 లక్షల 35 వేల 621 రూపాయల విలువగల 6128 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేసి 27 మందిని బైండోవర్‌ చేసినట్టు చెప్పారు. సరిహద్దుల్లో సైతం నిఘా పెంచినట్టు తెలిపారు. ఈనెల 10 సాయంత్రం నుంచి 11 మధ్యరాత్రి వరకు డ్రైడేగా ప్రకటించినట్టు పేర్కొన్నారు. అభ్యర్తులు 48 గంటల ముందునుంచే ప్రచారం నిర్వహించవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, నోడల్‌ అదికారులు, సిపివో శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *