Breaking News

అవినీతో, సంక్షేమమే ప్రజలే తేల్చాలి

కామారెడ్డి, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ది కావాలో, అవినీతి కావాలో ప్రజలే ఓటు ద్వారా తేల్చుకోవాలని కామారెడ్డి అసెంబ్లీ బిజెపి అబ్యర్తి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాచారెడ్డి మండలం ఆరేపల్లితోపాటు పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లకు పైగా వివిధ పార్టీల నాయకులు కామారెడ్డిని ఏలారని, వారు చేసిన అవినీతి తప్ప అభివృద్ది ఎక్కడుందని ప్రశ్నించారు. అభివృద్ది గురించి ప్రశ్నిస్తే కామారెడ్డి గాంధీ విగ్రహం సాక్షిగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తమ అవినీతి చిట్టాలను బయటపెట్టుకున్నారని విమర్శించారు. అభివృద్దే చేసి ఉంటే ప్రజలను ఓట్ల కోసం ఎదురించి భయ భ్రాంతులకు గురిచేయాల్సిన అవసరమేముందని నిలదీశారు. సంక్షేమం చేసేందుకు తాము సిద్దంగాఉన్నామని, బిజెపికి ఓటు వేసి సంక్షేమాన్ని గెలిపించాలని కోరారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *