Breaking News

దివ్యాంగులపై వివక్షత వీడాలి

రెంజల్‌, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులపై చూపించాల్సింది సానుభూతి కాదని వారికి కావాల్సింది ప్రోత్సాహమని ఎంపిడివో చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని సాటాపూర్‌ భవిత కేంద్రంలో సోమవారం దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తు ఆట పాటల్లో విజయాలు సాధించాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఇవో గణేవ్‌రావు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌, విశ్వనాథన్‌, స్వప్న తదితరులున్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *