Breaking News

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలు 2018లో భాగంగా ఈనెల 7న పోలింగ్‌, 11న కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రంగం పూర్తిచేసిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఎంసిఎంసి కంట్రోల్‌రూంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి జుక్కల్‌, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి 5 లక్షల 77 వేల 736 మంది ఓటర్లున్నారని, వీరందరికి ఫోటో ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిచేశామని తెలిపారు. ఓటర్లు ఓటింగ్‌కు వచ్చేటపుడు ఎపిక్‌ కార్డుతోపాటు గుర్తింపు కార్డు తీసుకురావాల్సి ఉంటుందని, వీరితో సంతకంతోపాటు వేలిముద్ర తీసుకుంటారని పేర్కొన్నారు. ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు సిబ్బంది సమాచారం అందిస్తారని, పోలింగ్‌ పారదర్శకంగా ఆన్‌లైన్‌లో నడుస్తుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రె, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఎన్నికల నోడల్‌ అధికారులు శ్రీనివాస్‌, చంద్రమోహన్‌రెడ్డి, సిబ్బంది రఘునాథ్‌, శ్రీనివాస్‌ బాబు, పద్మ, షబానా, నాగేంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డిలో స్వాగత తోరణం

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో ప్రధాన రహదారి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *