Breaking News

సొంత గ్రామంలో అభివృద్ది చేయలేనివారు నియోజకవర్గంలో ఏంచేస్తారు

కామారెడ్డి, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన సొంత గ్రామమైన బస్వాపూర్‌ను అబివృద్ది చేసుకోలేని గంప గోవర్దన్‌ ఇక నియోజకవర్గాన్ని ఏం అబివృద్ది చేస్తారని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. సోమవారం భిక్కనూరు మండలం బస్వాపూర్‌, కాచాపూర్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తెరాసకు ఓటు వేయకపోతే తరువాత వారి అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో కొందరు తెరాస కార్యకర్తలను గుండాలను, రౌడీలుగా మార్చి వారికే ప్రభుత్వ లబ్దిపథకాలను ఇప్పించి ప్రజలపై జులుం చేయిస్తున్నారని విమర్శించారు. పదిసంవత్సరాల నుంచి మల్లుపల్లి గ్రామానికి రోడ్డు వేయుమని అడుగుతుంటే గంప దాన్ని ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. ఆయనను వ్యతిరేకిస్తే వారిని ఉద్యోగాల నుంచి తీసివేయిస్తారని, వారికి పని దొరకకుండా చేస్తారని పేర్కొన్నారు. మాజీ మంత్రి శంకర్‌రావు మాట్లాడుతూ షబ్బీర్‌ అలీ జాతీయ స్థాయిలో బలమున్న నాయకుడని, ఆయనను గెలిపిస్తే రాష్ట్రంలో మొదటి లేదా రెండో స్థానంలో ఉంటాడని అన్నారు. కాంగ్రెస్‌ కూటమిని గెలిపించి అభివృద్దికి బాటలు వేయాలని ఓటర్లను కోరారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *