Breaking News

షకీల్‌ అన్నను 50 వేల మెజార్టీతో గెలిపిస్తాం

రెంజల్‌, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ అన్నను 50 వేల భారీ మెజార్టీతో గెలిపించుకుని బోధన్‌లో గులాబి జెండా ఎగురవేస్తామని జాగృతి జిల్లా నాయకులు వికార్‌ పాషా అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో సోమవారం తెరాస పార్టీ ఆద్వర్యంలో బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు కారు గుర్తుకు ఓటు వేసి షకీల్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కుర్మె సాయిలు, శ్రీకాంత్‌, మధు, ముంతాజ్‌ బేగ్‌, సాయిలు, అఖిల్‌ తదితరులు ఉన్నారు.

Check Also

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు మున్సిపాలిటీలలో 25వ తేదీ శనివారం ఉదయం 8 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *