Breaking News

హామీల అమలులో తెరాస విఫలం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హామీల అమలులో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్‌ అర్బన్‌ బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ ఆరోపించారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కెసిఆర్‌ ఏ కారణం లేకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా వందలకోట్ల భారం ప్రజలపై మోపారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 203 కోట్ల రూపాయలు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం మంజూరు చేయించానని, అదేవిధంగా 145 కోట్లు యుజిడి పనుల కోసం మునిసిపల్‌ కార్పొరేషన్‌కు అప్పుగా బిగాల తెచ్చారని ఆయన ఆరోపించారు. బిగాల పంచిన కరపత్రాల్లోని అభివృద్ది అంశాలన్ని బూటకమని, నాలుగున్నరేళ్లలో ఏంచేశారో చెప్పకుండా తిరిగి అవకాశం ఇస్తే అభివృద్ది చేస్తామని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు వారిపై దాడులకు పాల్పడ్డ సంఘటనలు అనేకమని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా తెరాస ప్రబుత్వం అడ్డుకుందని, బిజెపి అధికారంలోకి రాగానే పేదల సొంతింటి కల సాకారం చేస్తామని అన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే పేదలందరికి పక్కాఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. మజ్లిస్‌ ఆగడాలతో అభద్రతా భావంతో ఉన్నవారికి అండగా ఉండి నగరం శాంతియుతంగా ఉండేలా చూస్తామన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని యెండల పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు దేవిదాస్‌, ప్రధాన కార్యదర్శి నరేందర్‌, ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా సీనియర్‌ పాత్రికేయులు ఉన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *