Breaking News

వెబ్‌కాస్ట్‌ కెమెరామెన్‌ ఓటరు ప్రవేశాన్ని రికార్డు చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెబ్‌కాస్ట్‌ కెమెరామెన్‌ ఓటరు ప్రవేశాన్ని తప్పకుండా రికార్డు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ రోజున వెబ్‌కాస్టింగ్‌ కోసం 74 మంది విద్యార్థులకు సోమవారం స్థానిక ఆర్‌కె డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటు వేసే కంపార్టుమెంటును రికార్డు చేయకూడదని తెలిపారు. పోలింగ్‌ ముందురోజు 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు 74 వెబ్‌కాస్టింగ్‌ స్క్రీనింగ్‌ ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని అన్నిస్థాయిల్లో ఎన్నికల కమీషన్‌ వరకు గమనిస్తారని తెలిపారు. పోలింగ్‌ రోజు ఉదయం 6 నుంచి 6.30 వరకు మాక్‌పోలింగ్‌ జరుగుతుందని, ఉదయం 5.45 గంటలకే వెబ్‌ కాస్టింగ్‌ తో సిద్దంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రె, నోడల్‌ అధికారులు అమీన్‌సింగ్‌, దామోదర్‌రెడ్డి, సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *