Breaking News

ఎన్నికల ప్రచారంలో బిగాల కుటుంబీకులు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ తెరాస అభ్యర్థి బిగాల కుటుంబ సభ్యులు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీవాణి, శ్రీరాణి, ఎల్లమ్మగుట్ట, 5వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రభుత్వ పెన్షన్‌ లబ్దిదారులుండడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. బిగాల లత మాట్లాడుతూ తెరాస అభ్యర్థి గణేష్‌ గుప్తను గెలిపించి నిజామాబాద్‌ నగరాన్ని మరింత అభివృద్ది చేసుకుందామని అన్నారు. బిగాల హయాంలోనే నిజామాబాద్‌ నగరం అభివృద్ది పనులు ప్రారంభించిందన్నారు. మౌలిక వసతుల కల్పనకు మాస్టర్‌ ప్లాన్‌తో ముందుకు వెళుతున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ ఆకుల సుజాత, కార్పొరేటర్‌ నర్సుబాయి, మాజీ ఎంపిపి శాస్త్రి వకుల, వనిత, వాణి, సరిత తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *