Breaking News

ఎన్నికల ఉల్లంఘన జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ తేదికి ముందు రోజుల్లో ఎటువంటి సంఘటనలు, ఎన్నికల ఉల్లంఘనలు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అదికారి సత్యనారాయణ అధికారులకు సూచించారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం నుంచి మంగళవారం ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, రిటర్నింగ్‌ అధికారులు, పోలీసుశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్టులో భాగంగా పోలింగ్‌కు 72 గంటల ముందు ఎటువంటి డబ్బులను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేయకుండా రిటర్నింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వేతనాలు, ఇతరత్రా మినహాయింపు ఎలాంటి లావాదేవీలు చేపట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. 72 గంటల్లో ఎలాంటి లావాదేవీలు జరిపినా వాటిని ట్రాక్‌ చేయాలన్నారు. పోలింగ్‌కు ముందు మాక్‌ పోలింగ్‌ జరపాలని సూచించారు.

జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి మాట్లాడుతూ పోలింగ్‌కు 72 గంటల ముందు నుంచే ధన, మద్య ప్రవాహం జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోర్రె, ఆర్డీవో రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *