Breaking News

చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నవీపేట మండలం యంచ, రెంజల్‌, కందకుర్తి వద్ద అంతర్‌జిల్లా చెక్‌పోస్టులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల రోజు వరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీల సమయంలో వివరాలను అడిగి తెలుసుకోవాలని, నమోదు చేసి రిజిస్ట్రేషన్లు, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ సూచించారు. సిబ్బంది పనితీరును, హాజరును కలెక్టర్‌ పరిశీలించారు. ఎన్నికల సమయంలో మూడురోజులు అత్యంత ప్రధానమైనవని అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత నగదు, మద్యంతోపాటు పెద్ద సంఖ్యలో బహుమతులు దొరికినా వెంటనే సీజ్‌ చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు తప్పకుండా తనికీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Check Also

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *