Breaking News

ఎన్నికల వరకు చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీ తనిఖీలు చేపట్టాలి

రెంజల్‌, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల రోజు వరకు చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికీలు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని కందకుర్తి అంతరాష్ట్ర చెక్‌పోస్టును పరిశీలించి తనిఖీల వివరాలు సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనుమానిత నగదు, మద్యంతోపాటు పెద్ద సంఖ్యలో బహుమతులు దొరికినా సీజ్‌ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తప్పకుండా తనికీ చేయాలన్నారు. అనంతరం తాడ్‌బిలోలి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పంపిణీ చేస్తున్న ఓటరు స్లిప్పులను నేటితో పూర్తిచేయాలని సిబ్బందికి ఆదేశించారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *