Breaking News

గుడిసెకు నిప్పంటుకొని ఇద్దరు చిన్నారుల మృతి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని గూపన్‌పల్లి ప్రాంతంలో ఆర్మూర్‌ రోడ్డు పక్కన గుడిసె వేసుకొని బతుకు దెరువుకోసం అంజుమాన్‌ ఫారం నుంచి నిజామాబాద్‌ వచ్చి కూలి పనిచేస్తున్న కుటుంబం అగ్నిప్రమాదంతో చిన్నాభిన్నమైన సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… అంజుమన్‌ ఫారానికి చెందిన దేవిదాస్‌, భార్య, ఇద్దరు చిన్నారులతో పాటు గూపన్‌పల్లి పెట్రోల్‌పంపు వద్ద గుడిసెలో ఉంటూ కూలిపనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. రోజువారిలాగే పనిపూర్తిచేసుకొని ఇద్దరు చిన్నారులతో కలిసి నిద్రకు ఉపక్రమించారు. నివాసముంటున్న గుడిసెలో ప్రమాదవశాత్తు కిందపడి మొత్తం నిప్పంటుకోగా ప్రమాదంలో ఇద్దరు కుమారులు సాయితేజ (7), వినయ్‌సాయి (1) తోపాటు నాగలక్ష్మికి నిప్పంటుకుంది. ప్రమాదంలో పిల్లలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో అంజుమన్‌ ఫారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Check Also

నగర మేయర్‌ ఆధ్వర్యంలో రక్తదానం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని రెడ్‌ క్రాస్‌ సొసైటీలో రక్త నిధుల‌ కొరత ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *