Breaking News

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది విధులను పకడ్బందీగా నిర్వహించాలని నిర్లిప్తతకు తావివ్వద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం కామరెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై పూర్తిస్తాయి అవగాహన కలిగి ఉండాలని, ముందే సందేహాలు నివృత్తిచేసుకోవాలని సూచించారు. పోలింగ్‌రోజున ప్రతి రెండు గంటలకు పోలింగ్‌ శాతాన్ని తెలియజేయాలని చెప్పారు. మాక్‌పోల్‌, క్లియరెన్సుపై శ్రద్ద కనబర్చాలన్నారు. ఉదయం 5.45 గంటలకేపోలింగ్‌ ఏజెంట్లు సన్నద్దమయ్యేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *