Breaking News

ఆశీర్వదించండి, అండగా ఉంటా

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్‌ నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి తాహెర్‌బిన్‌ హందాన్‌ కోరారు. మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని, అర్బన్‌ ప్రజలు కూడా తనను ఆప్యాయంగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్ని నెరవేరుస్తుందని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అర్బన్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరుస్తానని తాహెర్‌ అన్నారు. కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్తి రేవంత్‌రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.

Check Also

జనాభా లెక్కల్లో బిసి గణన చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేమెంతో మాకు అంతే వాటా కావాలంటే మా జనాభా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *