Breaking News

తెరాసలో చేరిన రాజారాం యాదవ్‌

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు తెలంగాణ పోరాటంలో చురుకైన పాత్ర వహించిన రాజారాం యాదవ్‌ మంగళవారం ఎంపి కవిత, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమిలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన రాజారాం యాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాసలో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు రేవంత్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న రాజారాం యాదవ్‌, ఆయనతోపాటు కాంగ్రెస్‌లో చేరారు. ప్రజాకూటమి పేరుతో అన్ని పార్టీలు కలిసి తెరాసపై బరిలో దిగినప్పటికి రాజారాం యాదవ్‌ మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటు వస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్‌ నాయకత్వం మేలు అని తలచి ఎంపి కవిత ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

Check Also

నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్త వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ అనేది కరోనా వైరస్‌ ద్వారా వ్యాపించే సాధారణమైన ...

Comment on the article