Breaking News

ఓటమి భయంతోనే రేవంత్‌రెడ్డి అరెస్టు

కామారెడ్డి, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అందుకోసమే రేవంత్‌రెడ్డిని అర్దరాత్రి అరెస్టు చేయించారని కామరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. మంగళవారం ఆయన మాచారెడ్డి మండలం మాచారెడ్డి, సీతాయిపేట్‌, అన్నారం, రెడ్డిపేట్‌ గ్రామాల్లో పర్యటించారు. వరంగల్‌లో నిర్వహించిన కెసిఆర్‌ సభ జరగదేమోనని భయంతో ముందస్తు అరెస్టు చేయించారని రాష్ట్రంలో మహాకూటమి గెలుపును అరెస్టులతో ఆపలేరని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల కెసిఆర్‌ పాలనపై ప్రజలు విసుగుచెందారని, గజ్వేల్‌లో తన ఓటమిని తానే ఒప్పుకున్నారని అన్నారు. రాష్ట్రంలో మహాకూటమి గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. మహాకూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *