Breaking News

ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెరాస విఫలం

రెంజల్‌, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని గొప్పలు చెప్పడమే తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెరాస పార్టీ విపలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బాగేపల్లి గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ఒక్క కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. ఎన్నికలకు ముందు అది చేస్తాం ఇది చేస్తాం అని గొప్పలు చెప్పిన కెసిఆర్‌ చేసిందేమిలేదని అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్‌ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. ప్రతి గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గొప్పలు చెప్పిన కెసిఆర్‌ హామీ ఏమైందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీ నెరవేరుస్తామన్నారు. అనంతరం గ్రామానికి చెందిన బిజెపి, అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకులు సుమారు 50 మంది మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి పార్టీ కండువావేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపిపి మోబిన్‌ఖాన్‌, జడ్పిటిసి నాగభూషణ్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అద్యక్షుడు సాయారెడ్డి, కరణ్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఇమాంబేగ్‌, మాజీ సర్పంచ్‌ జావిదోద్దీన్‌, సురేందర్‌గౌడ్‌, శంసోద్దీన్‌, మధు, తదితరులున్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *