Breaking News

యెండల విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ మంగళవారం 8,11,18వ డివిజన్‌లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని బిజెపిని ప్రజలు ఆదరిస్తు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. బిజెపి గెలుపుపట్ల దీమా వ్యక్తం చేశారు. మార్కెట్‌ను సుందరీకరణ చేస్తామని, డ్రైనేజీ సమస్య పరిష్కరించి నగరాన్ని స్మార్ట్‌ సిటిగా మార్చడమే బిజెపి లక్ష్యమని అన్నారు. యువతకు ముద్ర పథకం ద్వారా పెట్టుబడి ఇచ్చి వారు వ్యాపారాలు పెట్టుకోవడానికి కృషి చేస్తామని, నిరుపేదలందరికి ఇళ్లు నిర్మించడమే తమ ధ్యేయమని, నగరంలో నెలకొన్న ట్రాఫిక్‌ సమస్యకు మాస్టర్‌ ప్లాన్‌తో పరిష్కరిస్తామని అన్నారు. అర్బన్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అబివృద్ది చేస్తామని రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ సునీత, గోపాల్‌, శ్రీనివాస్‌, నరేశ్‌, అరుణ, నవీన్‌, పాండు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *