Breaking News

నల్లవెల్లిలో బాజిరెడ్డి విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస రూరల్‌ అభ్యర్తి బాజిరెడ్డి గోవర్దన్‌ ఇందల్వాయి మండలం, నల్లవెల్లి గ్రామంలో బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ పార్టీ అనవసర ఆరోపణలు చేస్తున్నారని, వారికి పథకాలపై అవగాహన లేదని, ఓటమి భయంతో నోటికొచ్చి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస పాలనలో ప్రజలందరు సుభిక్షంగా ఉన్నారని, స్వచ్చమైన పాలన అందిస్తున్నామని, రానున్న ఎన్నికల్లో తనను బారీ మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా రాష్ట్రంలో తిరిగి తెరాస ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని బాజిరెడ్డి అన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *