Breaking News

రోడ్‌షోలో పాల్గొన్న బిగాల గణేష్‌ గుప్త

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ తెరాస అభ్యర్థి బిగాల గణేష్‌ గుప్త రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిగాల మాట్లాడుతూ నిజామాబాద్‌ నగర అభివృద్దికి అహర్నిశలు కృషి చేశానని, రూ. 850 కోట్లు వెచ్చించామని, దాంతో నగర సుందరీకరణతోపాటు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేస్తున్నామని, ఇవి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. నగర అభివృద్దికి తాను నిరంతరం రాత్రనక, పగలనక కృషిచేశానని, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెరాస అభ్యర్థులందరిని అందరిని గెలిపిస్తాయని అన్నారు. ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకాలు పొందినవారుండడం చూశామన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Check Also

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *