Breaking News

చంద్రబాబు తెలంగాణలో పెత్తనం చలాయించాలని చూస్తున్నారు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెత్తనం చలాయించాలని చూస్తున్నారని నిజామాబాద్‌ ఎంపి కవిత ఆరోపించారు. బుధవారం ఎంపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహాకూటమి పేరుతో చంద్రబాబు తిరిగి తెలంగాణను బానిస, వలస పాలకులచేతిలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారని అన్నారు. ఏదేమైనా తెలంగాణ ప్రజలు మాత్రం తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారని, మహాకూటమి కుట్రలను పసిగట్టి తెరాసకు పట్టంగట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఎంపి కోరారు. తెలంగాణలో తెరాస తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఇందులో ఎలాంటి సందేహం లేదని కవిత అన్నారు. రైతులందరికి రైతుబంధు పథకాన్ని రెండు పంటలకు అందిస్తున్నట్టు కవిత వివరించారు. అన్ని రకాల పింఛన్లను పెంచనున్నట్టు, అన్ని కులాల ఫెడరేషన్‌లకు ఆర్థిక సాయం అందిస్తామని కవిత అన్నారు. ఓసి పేదలను గుర్తించి వారికి ప్రత్యేకంగా ఆర్తిక చేయూతనందిస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహాకూటమి వ్యతిరేకమని, ముఖ్యంగా చంద్రబాబునాయుడు తెలంగాణ అభివృద్ది చూసి ఓర్వలేక ఇప్పటికే అనేక కేసులు వేయించారని, ఎంతో బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. ఏదేమైనా, ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ప్రజలు మాత్రం తెరాస అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆదరిస్తున్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి బిగాల గణేశ్‌ గుప్త, నగర మేయర్‌ ఆకుల సుజాత, నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *