Breaking News

కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అదికారం చేపట్టడం ఖాయమని టిపిసిసి కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. బుధవారం కాంగ్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాస ప్రభుత్వం పథకాల అమలులో విఫలమైందని, వారు చెబుతున్న పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలు కమీషన్లకోసమే చేపట్టారని ఆయన అన్నారు. మహాకూటమి పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, కాంగ్రెస్‌ పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని, రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అర్బన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి తాహెర్‌ బిన్‌ హందాన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *