Breaking News

ముగిసిన ఎన్నికల ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం సాయంత్రం 5 గంటలతో తెలంగాణలో జరగనున్న ఎన్నికల ప్రచారం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని పార్టీలు బుధవారం 5 గంటలకల్లా ప్రచారం ముగించాలని ఎన్నికల నోటిఫికేషన్‌ సందర్భంగా ఆదేశాలు జారీచేసింది. నిజామాబాద్‌ జిల్లాలో ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్‌, బిజెపిలతో పాటు ఇతర పార్టీలు తమ అభ్యర్థులను అన్ని నియోజకవర్గాల్లో పోటీకి నిలిపాయి. తెరాస, బిజెపి వేరువేరుగా పోటీచేస్తుండగా కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, టిజెఎస్‌లు మహాకూటమిగా పోటీలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎన్నికల నోటిపికేషన్‌ నాటినుంచి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికితోడు జిల్లా అధికార యంత్రాంగం కూడా అభ్యర్థులపై గట్టి నిఘా ఉంచడంతోపాటు అంతర్‌రాష్ట్ర సరిహద్దు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా ధన, మద్య ప్రవాహం అరికట్టడంలో సఫలీకృతమయ్యారు. రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్‌ ఇతర అధికారులతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తు ఎక్కడా డబ్బు, మద్యం సరఫరా కాకుండా అడ్డుకున్నారు. ఏదేమైనా అభ్యర్థులు మాత్రం ఓటర్లను ప్రలోబానికి గురిచేయడానికి తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *