Breaking News

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7వ తేదీన జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. 7న జరిగే సాధారణ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని విదాలా సిద్దంగా ఉందని, ఎన్నికల యంత్రాంగం తరఫున అవసరమైన అన్ని కార్యక్రమాలు ముందు జాగ్రత్తతో పూర్తిచేయడం జరిగిందని కలెక్టర్‌ చెప్పారు. 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం ముగించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని పార్టీలను హెచ్చరించారు. పత్రికా ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని, ప్రచారానికి వచ్చిన ఇతర జిల్లాల వారు తమ సొంత స్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టుల వద్ద 1.16 కోట్ల విలువగల మద్యం, నగదు సీజ్‌ చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. ఓటర్లు నిర్భయంగా నిస్పక్షపాతంగా, స్వేచ్చగా ఓటు వేయాలని, ఓటు వేయడానికి అవసరమైన బందోబస్తు, ఇతర చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఏ ఒక్కరు కూడా బుధవారం సాయంత్రం నుంచి ప్రచారం నిర్వహించడానికి వీలులేదని, ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దీన్ని ఉల్లంఘించిన వారిపై సెక్షన్‌ 126 ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉంటాయని హెచ్చరించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్టు, వీరికి పోలింగ్‌ కేంద్రాలకు రవాణా చేయడానికి 440 వీల్‌చైర్లు సమకూర్చడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఆటోల్లో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తిరిగి నివాసాలకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నాటినుంచి ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అన్నారు. 1195 మంది పోలీసులు, 600 మంది హోంగార్డులను తనిఖీల సమయంలో నియమించామన్నారు. ఎన్‌ఫోర్సుమెంట్‌ టీంల ఆద్వర్యంలో తనికీల ద్వారా 70.61 లక్షల నగదు, 43.2 లక్షల విలువగల 16 వేల 254 లీటర్ల మద్యం సీజ్‌ చేయడం జరిగిందన్నారు. 11న జరిగే ఓట్ల లెక్కింపు కొరకు ఏర్పాట్లు చేశామని, స్థానిక బాలికల, బాలుర పాలిటెక్నిక్‌ కళాశాల ఇందుకోసం ఎంపిక చేసినట్టు తెలిపారు. 102 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 114 మంది సహాయక సూపర్‌వైజర్లు, 114 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని అన్నారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని, సమస్యలుంటే రిటర్నింగ్‌ అధికారిని సంప్రదించాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలన్నారు.

సమావేశంలో డిఆర్‌డివో అంజయ్య, సమాచారశాఖ డిడి ముర్తుజ తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *